రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా: ఆంధ్రప్రదేశ్ లో మత్స్య సంపద వినియోగాన్ని పెంచేందుకు, అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృతపర్చే లక్ష్యంతో రాష్ట్రంలో సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.
శుక్రవారం నగరంలోని స్థానిక మంజీర ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నందు 4వ ఆక్వా & సీఫుడ్ ఫెస్టివల్ ను మంత్రి తానేటి వనిత, కలెక్టరు డా. కే.మాధవీలత, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలసి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్స్ సంస్థ సహకారంతో నిర్వహించడం జరిగింది. సభా ప్రాంగణంలో మత్స్య ఉత్పత్తులపై ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను మంత్రి , ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఔ త్సాహిక పారిశ్రామిక వేత్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డా. తానేటి వనిత మాట్లాడుతూ మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడంలో దేశంలోనే మన రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏపీలో చేపల ఉత్పత్తి ఎక్కువగా ఉందని, అయితే వాటిపై అవగాహన లేక పోవడం వల్ల తక్కువుగా వినియోగం జరుగుతోందన్నారు. ప్రజల్లో ఆక్వా ఉత్పత్తుల వినియోగం పెంచాలన్నారు. ఇందుకు సంబందించి దేశీయ మార్కెటింగ్ అభివృద్ది మరింత జరగాల్సి ఉందన్నారు. నేటి నుంచి 10 వ తేది వరకు మూడు రోజుల పాటు హోటల్ మంజీరా కాంటినెంటల్ హోటల్ లో నిర్వహించనున్న 4వ ఆక్వా – సీ ఫుడ్ ఫెస్టివల్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫిష్ ఆంధ్రా అనే బ్రాండ్‌ను మరింతగా ప్రమోట్ చేయాల్సిన అవసరం మనపై ఉందన్నారు. చేప ఆరోగ్యకరమైన ఆహారమని ఇ – విటమిన్ తో పాటు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం మనకు అందుబాటు తక్కువగా ఉంటోందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి వినియోగ దారుల్లో మరింత అవగాహన పెంచడమే ఈ ఫెస్టివల్ ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఎంతో తోడ్పాటునందిస్తున్నారన్నారు. మత్స్య ఉత్పత్తులను ఏవిధంగా వినియోగించుకోవాలనే అంశంపై మత్స్యశాఖ , భూమి ఆర్గానిక్స్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీ పుట్ ఫెస్టీవల్ లో వివిధ రకాల సముద్ర ఉత్పత్తులను లైవ్ ద్వారా స్థాల్స్ లో చూడడం జరిగిందని పేర్కొన్నారు. ఫిష్ ఆంధ్రా ఔట్లెట్స్, మొబైల్ వాహనాల ను ప్రోత్సహించి, సబ్సిడీపై అందించడం ద్వారా ఆయా రంగాలపై ఆధారపడిన కుటుంబాలను ఆదుకుంటున్నా మన్నారు. ఫిష్ ఆంధ్ర ఫిట్ ఆంధ్రా పేరుతో ప్రజలకు ఇప్పటికే మత్స్య సంపద ను అందుబాటులోకి తెచ్చామని, ఇందులో భాగంగా చేపలు, రొయ్యల వ్యాపారాభివృద్దికి మొబైల్ వాహనాలు అందించామన్నారు. రాష్ట్రంలో కరోనా సమయంలో డొమెస్టిక్ మార్కెట్ అందుబాటు లోనికి వచ్చిందన్నారు. ఆక్వారంగ అభివృద్దికి ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందన్నారు. సముద్రం ద్వారా లభించే చేపలు, రొయ్యలు, పీతలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆహారం అన్నారు. అటువంటు ఆహారాన్ని మన ప్రాత ప్రజలు సరిగ్గా వినియోగించు కోవడం లేదన్నారు. ప్రజలకు సముద్ర ఉత్పత్తులపై మరింత అవగాహన కల్పించేందుకు ఈ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రామాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. జిల్లా కలెక్టరు డా. కే.మాధవీలత మాట్లాడుతూ సముద్రపు ఉత్పత్తుల్లో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి ప్రోటీన్స్ అత్యధికంగా ఉంటుందని నేడు ప్రతి ఒక్కరికీ ఆ తరహా ఆహారం నిత్యం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఫిష్ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించడం జరుగు తుందన్నారు. మాంసాహారం లో చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య పరిరక్షణ సాధ్యం అవుతుందన్నారు . జపాన్, కొరియా వంటి దేశాల్లో ప్రజలు ఎక్కువగా ప్రధాన ఆహారంగా సీ ఫుడ్స్ తినడం వల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. భారత దేశంలో తక్కువగా సముద్రపు ఉత్పత్తులను ఆహారంలో తీసుకోవడం గమనిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సముద్రపు ఉత్త్పత్తులను ప్రోత్సహించి వాటిని వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ఏపీ ఖాదీబోర్డు చైర్ పర్సన్ పిల్లి నిర్మల, రూడా(మాజీ) చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి, భూమి ఆర్గానిక్స్ సంస్థ ప్రతినిధి రఘురామ్, మెరైన్ జేడీ వివిరావు, మత్స్య శాఖ అధికారులు వి.కృష్ణా రావు, వివిరావు, లాల్ మహమ్మద్, పివి సత్యనారాయణ, ఆర్ వి ఎస్ ప్రసాద్, జాన్ బాషా, సెంట్రల్ సభ్యులు వి. కృష్ణయ్య, ఏ డీ పవన్, జిల్లా అధికారులు, ఆక్వా రైతులు, పారిశ్రామిక వేత్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
[zombify_post]