–నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలి
— ఒక్కో దళిత బంధు యూనిట్ ను పది మంది కి ఎలా పంచుతారు
—దళిత సమాజమా బి.ఆర్. ఎస్. పార్టీ మోసాన్ని ఎండకట్టాలి
దళిత బంధు పేరుతో మరోసారి సత్తుపల్లి నియోజకవర్గంలో బి.ఆర్. ఎస్. పార్టీ దళిత సమాజాన్ని మోసం చేయాలని చూస్తుందని, కాబట్టి దళిత సమాజం బి.ఆర్. ఎస్. పార్టీ మోసాన్ని ఎండకట్టాలి మాజీ దళిత ప్రజా ప్రతినిధులు, దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు.
శుక్రవారం సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పధకాన్ని అమలు చేసి దళితుల పట్ల స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన శిత్తశుద్ధిని చాటుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. పెనుబల్లి మండలం, కొత్త కరాయి గూడెం లో ఉన్న దళిత కుటుంబాలకు ఏ విధంగా దళిత బంధు పధకాన్ని ఇచ్చినారో.. అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పధకాన్ని అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. కానీ గత వారం రోజులుగా నియోజకవర్గంలోని మాల, మాదిగ కాలనీల్లో దళిత బంధు పధకం వచ్చిందని ,అది కేవలం బి. ఆర్. ఎస్. పార్టీ కార్యకర్తల కోసమని ప్రచారం చేయడాన్ని వారు తప్పు పట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రాజకీయ రంగు పులమడం ఏమాత్రం స్థానిక ఎమ్మెల్యే కు తగదని వారు హితవుపలికారు.. ఒక్కో దళిత బంధు యూనిట్ ను పది మంది కి చొప్పున కేటాయిస్తున్నట్లు అధికార పార్టీ నాయకులు దళితుల్లో లేనిపోని అపోహలను కల్పిస్తున్నారని,అది ఎలా సాధ్యం పడుతుందో దళితులకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో కుటుంబానికి ఇవ్వాల్సిన దళిత బంధు యూనిట్ ను పది మందికి ఎలా పంచుతారో స్థానిక ఎమ్మెల్యే దళిత సమాజానికి సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.. దళిత బంధు పేరుతో దళిత వాడల్లో అధికార పార్టీ నాయకులు చేసే హడావిడి కి దళితుల మధ్య ఐక్యత విచ్చిన్నం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. నిజంగా సత్తుపల్లి నియోజకవర్గంలో దళితుల పట్ల స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కు దయ ఉంటే నియోజకర్గం లోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పధకాన్ని వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. అమలు కానీ, ఆచరణ సాధ్యం కాని మాయ మాటలకు నియోజకవర్గంలోని దళితులు మోస పోవద్దని వారు చూసించారు.. దళిత బంధు పధకం పేరుతో దళితులను మోసం చేసి ఓట్లు దండు కోవాలనే కుట్ర జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో నాయకులు ఖమ్మం పాటి కాంతారావు, యంగల సురేష్, మాగంటి శ్రీను, ఎక్కిరాల ప్రభాకర్, ముల్లంగి రమేష్, నల్లగట్ల జమాలయ్య, లింగబోయిన కృష్ణ, జానపాటి వెంకటేశ్వర్లు, కంచెపోగు సురేష్, మారేశ్, ఆదినారాయణ, స్థానిక మహిళలు పాల్గొన్నారు
[zombify_post]