పట్టణాల్లో నాన్ అమృత్ తాగునీటి పథకాల పనులు ముందుకు సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018లో ప్రవేశ పెట్టింది. ఆ మరుసటి సంవత్సరం ఈ పనులకు సంబంధించి గుత్తేదారుతో అంగీకారం కుదర్చుకున్నారు.
*అందని బిల్లులు.. నిలిచిన పనులు..
*మూడు పట్టణాల్లో ఇబ్బందులు

పాలకొండ, గ్రామీణం: పట్టణాల్లో నాన్ అమృత్ తాగునీటి పథకాల పనులు ముందుకు సాగడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2018లో ప్రవేశ పెట్టింది. ఆ మరుసటి సంవత్సరం ఈ పనులకు సంబంధించి గుత్తేదారుతో అంగీకారం కుదర్చుకున్నారు. ఎట్టకేలకు 2022లో ప్రారంభం కాగా..
కొద్ది నెలలకే నిలిచిపోయాయి. మళ్లీ మొదలు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇప్పటికే చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడమే అని తెలుస్తోంది. దీంతో పుర ప్రజలను తాగునీటి సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.
ఇదీ పరిస్థితి..
నాన్అమృత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాలకొండ పట్టణానికి రూ.57 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 65 కి.మీ. మేర పైపులైన్లు వేయాల్సి ఉంది. వీటితో పాటు రక్షితనీటి పథకాల వరకు నాగావళి నుంచి మూడు కి.మీ. మేర ప్రధాన పైపులైను వేయాల్సి ఉంది. గత ఏడాది పైపులైన్ల పనులు ప్రారంభించారు. వీధుల్లో ఆరు కి.మీ. పొడవున గొట్టాలు వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎక్కడి పనులు అక్కడితో నిలిచిపోయాయి. ప్రస్తుతం పట్టణంలో నాలుగు పథకాలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాని పరిస్థితులు ఉన్నాయి.
జిల్లా కేంద్రమైన పార్వతీపురంలోనూ పనులు నిలిచిపోయాయి. పట్టణానికి మంజూరైన రూ. 63 కోట్ల నిధులతో వీధుల్లో మినహా 36 కి.మీ. మేర పదాన పైపులెను వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 23పూర్తిస్థాయిలో తాగునీరు సరఫరా కాని పరిస్థితులుఉన్నాయి.
జిల్లా కేంద్రమైన పార్వతీపురంలోనూ పనులు నిలిచిపోయాయి. పట్టణానికి మంజూరైన రూ.63. 63 కోట్ల నిధులతో వీధుల్లో మినహా 36 కి.మీ. మేర ప్రధాన పైపులైన్లు వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 23 మీటర్ల మేర పూర్తయ్యాయి. కొన్ని నెలల కిందట ఈ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం పట్టణ జనాభా 62 వేలకు అయిదు రక్షిత నీటి పథకాల ద్వారా పూర్తిస్థాయిలో అందడం లేదు. మూడు రోజులకోసారి కుళాయిల ద్వారా సరఫరా అవుతుందని స్థానికులు అంటున్నారు.
సాలూరు పట్టణానికి రూ.68.68 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పైపులైన్ల విస్తరణ పనులకు రూ.3.50 కోట్లు విలువైన సామగ్రిని సిద్ధం చేశారు. నెలలు గడుస్తున్నా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం పట్టణ జనాభా 55 వేలు కాగా ఒక్క రక్షిత నీటి పథకం ద్వారా తాగునీరు అందించాల్సి వస్తోంది.
రూ.10 కోట్లు చెల్లించాలి
మూడు పట్టణాల్లో రక్షిత నీటి పథకాల విస్తరణ పనులకు బిల్లుల చెల్లింపులు జరగకపోవడమే జాప్యానికి కారణం. ఇప్పటి వరకు చేసిన పనులకు సుమారు రూ. పది కోట్లు
మూడు పట్టణాల్లో రక్షిత నీటి పథకాల విస్తరణ పనులకు బిల్లుల చెల్లింపులు జరగకపోవడమే జాప్యానికి కారణం. ఇప్పటి వరకు చేసిన పనులకు సుమారు రూ.పది కోట్లు మేర గుత్తేదారులకు చెల్లించాల్సి ఉంది. ఇంతవరకు ఎలాంటి చెల్లింపులు లేకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీనికి తోడు 2018-19లో అప్పటి ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం టెండర్లు
ఆహ్వానించారు. ఇప్పటికే నాలుగేళ్లు గడవడంతో నిర్మాణ వ్యయం పెరగడంతో.. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం చెల్లించాలని గుత్తేదారులు కోరుతున్నారు. ధరలు పెంచి, బకాయిలు చెల్లిస్తే తప్ప పనులు పునరుద్ధరించడం కుదరదని అధికారులకు వారు స్పష్టం చేశారు.
*త్వరలోనే చెల్లింపులు
నాన్అమృత్ పథకం కింద తాగునీటి కల్పన పనులు త్వరలోనే పునఃప్రారంభమవుతాయి. బిల్లులు చెల్లింపులు కాని కారణంగా గుత్తేదారులు ముందుకు రావడం లేదు. చేసిన పనులకు సంబంధించిన బకాయిలు వచ్చే నెలలో చెల్లించే అవకాశం ఉంది. ఆ తర్వాత పైపులైను, ఇతర పనులు మొదలవుతాయి.
[zombify_post]