నూతన షాది ఖానా నిధుల విడుదల పట్ల హర్షం వ్యక్తం చేసిన మైనార్టీ సోదరులు..
నూతన షాది ఖానా నిధుల మంజూరుతో మరోసారి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మైనార్టీల పట్ల ఉన్న చిత్తశుద్ధి తేలిపోయింది.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అశ్రిఫ్ అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న మైనార్టీ నాయకులు..
ఖమ్మం నగరంలో మైనార్టీలకు అండగా నిలబడుతూ నూతన షాదిఖానాకు రూ.70 కోట్ల విలువగల భూమిని కేటాయించి, భవన నిర్మాణానికి రూ.4 కోట్లు విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మిఠాయి తినిపించుకుంటూ వారి ఆనందం వ్యక్తం చేసిన ఖమ్మం నగరం మైనార్టీ సోదరులు.
మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ గతంలో తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు మైనార్టీలకు అండగా నిలబడుతూ చిరస్థాయిగా నిలిచిపోయే షాదీ ఖానాలకు రూపుదాల్చారని హర్షం వ్యక్తం చేశారు.
డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ ఇచ్చిన మాట ప్రకారం నూతన షాదిఖానా మంజూరు చేసి నిధులు విడుదల చేయడం మైనార్టీల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని చాటుకున్నారని హర్షం వ్యక్తం చేశారు.
కార్పొరేటర్ మక్బూల్ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ సహకారంతో ఇటీవల కాలంలో శంకుస్థాపన చేసుకున్న రెండవ షాది ఖానాకు నిధులు మంజూరు కావడం సంతోషకరమని, మంత్రి పువ్వాడ మైనార్టీల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని, మైనార్టీలకు భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తూ అండగా నిలబడడం హర్షనీయమని మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపారు.
మాజీ కార్పొరేటర్ షాకత్ అలీ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ మైనార్టీల పక్షపాతని, గతంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. అందులో భాగంగా నూతనంగా మంజూరు చేసిన షాదిఖానాకు రూ.4కోట్లు మంజూరు చేసి మైనార్టీల ఆశాజ్యోతి గా మరోసారి రుజువు చేసుకున్నారని, బిఆర్ఎస్ ప్రభుత్వానికి మంత్రికి మైనార్టీ సమాజం ఎల్లవేళలా రుణపడి ఉంటుందని అన్నారు.
సిటీ సెంట్రల్ లైబ్రరీ చైర్మన్ మహమ్మద్ అశ్రిఫ్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో మైనార్టీలకు పెద్దపీట వేస్తూ.. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మైనార్టీ ప్రజల ఆత్మ బంధువు అజయ్ తన సుపరిపాలన కొనసాగిస్తున్నారని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నూతన షాదీఖానాకు విలువైన భూమి, నాలుగు కోట్ల రూపాయలతో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల ఖమ్మం మైనారిటీ ప్రజల తరఫున మంత్రికికి బిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నగర బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇషాక్ మాట్లాడుతూ మంత్రి పువ్వాడ పై మైనార్టీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని నూతన షాదిఖానా మంజూరు తో పాటు నిధులు మంజూరు చేయడం హర్షనీయమని అన్నారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపిన నగర మైనార్టీ అధ్యక్షుడు శంషుద్దీన్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు బాజీ బాబా, నగర విద్యార్థి విభాగం సాద్, షాది ఖానా కమిటీ సభ్యులు సలీం, ముజాహిద్, ఫయాజ్, అబ్దుల్ ఖయ్యూం, అబ్దుల్ కరీం, పాన్ షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోసిన్, షారుక్, తాజుద్దీన్, మున్నా, ఖాద్రి, సాజిత్, ఇతర మైనార్టీ నాయకులు చోటు అజీమ్, నాగులు, అజీజ్ భాయ్, ఇలియాస్, ఆఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]