- కొవ్వూరు నియోజకవర్గం పరిధిలోని చాగల్లు మండలం చాగల్లు లో శ్రీ కనకదుర్గ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలను రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. ఆదివారం కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో దసరా దేవీ నవరాత్రుల తొలిరోజు ప్రత్యేక పూజల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలకు అందరికీ హోంమంత్రి స్వహస్తాలతో కుంకుమను పంచిపెట్టారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులందరికీ చీర, కలశం బిందెలను పంపిణీ చేశారు. ముందుగా ఉత్సవ కమిటీ డప్పు వాయిద్యాలతో హోం మంత్రి తానేటి వనితకు సాధన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. కనకదుర్గమ్మ అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో పాటు సంతోషకర జీవనం గడపాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!