*అక్టోబర్ 24 నుంచి వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్లు ఉన్నాయేమో.. చెక్ చేసుకోండి..* ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎవరికి మెసేజ్ చేయాలన్నా.. లేదా ఫొటోలు, వీడియోలు పంపాలన్నా.. టక్కున గుర్తుకొచ్చేది వాట్సప్. వాట్సప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదనడంలో అతిశయోక్తి లేదు. దీంతో తమ వినియోగదారుల సౌలభ్యం కోసం వాట్సప్ యాజమాన్యం కూడా తరచూ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా అనేక జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 24నుంచి కొన్ని రకాల ఫోన్లలో తమ సర్వీసులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ప్రధానంగా సెక్యూరిటీ ఫీచర్లను అప్‌డేట్ చేసుకునే వీలులేని పాత మోడల్ ఫోన్లలో వాట్సప్ పని చేయదని తెలిపింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యాజమాన్యం.. కొన్ని రకాల స్మార్ట్ ఫోన్లకు (Smart phones) తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్, అంతకంటే తక్కువ వర్షన్‌తో పని చేసే ఫోన్లలో వాట్సప్ సర్వీసును నిలిపివేయనున్నారు. ప్రతి ఏడాదీ తాము పాత సాఫ్ట్‌వేర్‌లను (Outdated software) ఏ పరికాల్లో అమలు చేస్తున్నాం.. వాటిని ఎంతమంది వినియోగిస్తున్నారు.. వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని, లేటెస్ట్ అప్‌డేట్స్‌ను పొందలేని ఫోన్లను అప్‌డేట్ చేసుకోవాలి.. అంటూ వాట్సప్ సందేశం పంపించింది. వాట్సప్ చెప్పిన జాబితాలోని ఫోన్లు ప్రస్తుతం పెద్దగా వాడుకలో లేనప్పటికీ.. ఇంకా ఎవరైనా వాడుతుంటే మాత్రం కొత్త డివైజ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ వాట్సప్ సేవలను నిలిపేయనున్న ఫోన్ల జాబితాలో మీ ఫోన్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి.. ఇకపై ఈ ఫోన్లలో వాట్సప్ పని చేయదు.. iPhone 5, iPhone 5c, Sony Xperia Z, Sony Xperia S2, Sony Ericsson Xperia Arc3, Motorola Xoom, Motorola Droid Razr, Samsung Galaxy Tab 10.1, Samsung Galaxy Nexus, Samsung Galaxy S2, Samsung G
This post was created with our nice and easy submission form. Create your post!