చాగల్లు మండలం చాగల్లు గ్రామంలో చాగల్లులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత నిర్వహించారు.. గురువారం 147వ రోజు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగన్నరేళ్ల పాలనలో అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. స్థానికుల నుంచి వచ్చిన మౌలిక వసతుల కల్పన, రోడ్లు, డ్రైన్ల సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కుటుంబ సభ్యులకు వివరించారు. వారు పొందిన లబ్ధి వివరాలతో కూడిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా తానేటి వనితకు ప్రజలంతా హారతులు పట్టి, పూలతో స్వాగతాలు పలికారు.
ఈ సందర్భంగా హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా.. అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల వద్దకు వెళ్తుంటే జగనన్న పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అలాగే నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే కాకుండా మీకు అందరికీ తోడు నీడగా నిలుస్తున్నజగనన్నకి మీరంతా బాసటగా నిలవాలని, మీ అందరి దీవెనలు, ఆశీర్వాదాలు అందచేయాలని, మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ని చేయాలని ఆమె కోరారు. . గతంలో ఏ ప్రభుత్వంలో కూడా చూడని గొప్ప పరిపాలనను చూస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేసారు. సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలను ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ దే హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!