పట్టణంలోని కొత్తబెలగాం 8వ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ సెక్రటరీ జి.శంకరరావుపై నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు
.పార్వతీపురంటౌన్: పట్టణంలోని కొత్తబెలగాం 8వ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వెల్ఫేర్ సెక్రటరీ జి.శంకరరావుపై నలుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తబెలగాంకు చెందిన జె.జగన్నాథం, టి.సంతోష్‌కుమార్, పి.రాము, ఏడుకొండల వెంకటరమణ అనే నలుగురు బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని 8వ సచివాలయానికి వెళ్లారు. తమకు జగనన్న చేదోడు పథకం రాలేదు ఎందుకుని, శంకరరావుతో వాగ్వాదానికి దిగారు. దీనికి ఆయన.. పథకం అందకపోతే మళ్లీ ఆన్లైన్లో గ్రీవెన్స్ దరఖాస్తు పెట్టుకోవచ్చునని తెలిపారు. అయినప్పటికీ ఆ నలుగురు కార్యదర్శిని తిట్టడంతో పాటు కొట్టారు. ఇంతలో సచివాలయ సిబ్బంది వచ్చి వారిని వారించారు. దాడిపై బాధితుడితోపాటు సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ జె.రామఅప్పల నాయుడికి తెలియజేసి, పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు.
This post was created with our nice and easy submission form. Create your post!