పాడేరు నియోజకవర్గం: అల్లూరి జిల్లా:ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాల వెలుగులు ప్రతి గడపలనూ కనిపిస్తున్నాయని పాడేరు శాసనసభ్యులు కొటగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. కొయ్యూరు మండలం రావణ పల్లి గ్రామ సచివాలయం పరిధిలోని నల్గొండ పంచాయతీ నల్గొండ, కొత్తవీధి, కొప్పుకొండ, వై ఎన్ పాకలు గ్రామాల్లో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భాగ్యలక్ష్మి ముఖ్యఅతిథిగా హాజరై గడపగడపకు తిరుగుతూ ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 313 గడపలను సందర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి ఈ నాలుగున్నరేళ్ల కాలంలో ఎవరెవరికి ఏ మేరకు లబ్ధి చేకూరిందన్న వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వులు కనిపించాయని ఈరోజు ప్రతి ఒక్కరి ఇళ్లు సంతోషాలతో కలకలాడుతున్నాయన్నారు. సంక్షేమ పథకాల వల్ల పేదల ఆర్థిక సామర్థ్యాలు పెరిగాయని తెలిపారు. సంక్షేమ పథకాల రూపంలో వచ్చిన ఆర్థిక సాయంతో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ఉపయోగపడిందన్నారు. దీంతోపాటు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి కూడా అంతే ప్రాధాన్యతిస్తున్నారన్నారు. నాడు నేడు కింద పాఠశాలలో సమూల మార్పులు , మౌలిక వసతులు కల్పన, విద్యా విధానంలోని వినూత్న పద్ధతుల అవలంబన వైద్యరంగంలో వినూత్న మార్పులు, హాస్పిటల్స్ లో మౌలిక వసతుల కల్పన వంటివన్నీ కూడా అభివృద్ధిలో భాగమైన తెలిపారు. ఇంత అద్భుత పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ జంపా రాజకుమారి, ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ, ఏఎంసి డైరెక్టర్ అచ్యుత్, వైస్ సర్పంచ్ భవాని ,ఎంపీపీ బడుగు రమేష్ ,జడ్పిటిసి వారా నూకరాజు, వైస్ ఎంపీపీ అప్పన్న వెంకటరమణ, అంబటి నూకాలమ్మ, మండల ప్రెసిడెంట్ జల్లి,బాబులు, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి ,ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి ,మండల కన్వీనర్ బండి సుధాకర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ నీలాపు సూరిబాబు ,రీమలి గంగాధర్ ,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ముసలి నాయుడు ,సర్పంచులు కొండ చిన్నతల్లి, సుర్ల చందు ,రావల సింహాచలం, కుర్జు పెంటమ్మ ,రీమల శ్రీను, పొట్టిక శ్రీను, రాజు, శోభన్ ఎంపీటీసీ చెడ్డా మల్లేశ్వరి ,ఎస్ రమాదేవి, మాజీ చైర్మన్ సోమర్లసూరిబాబు ,జిల్లా ప్రచార కమిటీ ధోని బాబ్జి, సోషల్ మీడియా కో కన్వీనర్ గాడి అచ్చిరాజు, సచివాలయ కన్వీనర్ నాగేంద్ర, ;గాడి సత్యనారాయణ, వనం బాబు, ధూపం శ్రీను, ఏ రామరాజు ,బంటు బుజ్జి, సావిత్రి, తిరుపతి, జగదీశ్వరి ,రమణ బాబు, లక్ష్మణరావు, దేవి ,లక్ష్మి, రాజేశ్వరి, కే అచ్యుత్ ,కే నాగమణి ,కే లక్ష్మి, అధికారులు, సచివాలయ సిబ్బంది ,వాలంటీర్లు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]