టిఎస్ ఆర్టీసీ నిర్వహిస్తున్న కార్గో పార్సిల్ సేవలను ఉపయోగించుకోవాలని ఖమ్మం రీజినల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి హరివర్మ అన్నారు. బుధవారం చర్ల బస్టాండులో నూతనంగా కార్గో పార్సిల్ కార్యాలయాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ఆర్టీసీ పార్సిల్ కొరియర్, కవర్లు తక్కువ చార్జీలతో వేగంగా, భద్రంగా తెలంగాణ వ్యాప్తంగా పంపించడం జరుగుతుందన్నారు. కార్గో ఎగ్జిక్యూటివ్స్ రవికుమార్, సైదులు, నిర్వాహకులు పాల్గొన్నారు.
[zombify_post]