అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం రమణపల్లి పంచాయతీ పరిధిలోని రవణపల్లి, తోట ఊరు, రేవడ వీధి, పాత రమణ పల్లి గ్రామాల్లో పాడేరు శాసనసభ్యులు శ్రీమతి కొట్టకుళ్ళి భాగ్యలక్ష్మి గారు బుధవారం నిర్వహించిన గడపగడప మన ప్రభుత్వం కార్యక్రమానికి విశేష స్పందన లబించింది. ఆమె సందర్శించిన ప్రతి గడపలోనూ సాదర స్వాగతం పలికారు. శాసనసభ్యులు తమ గ్రామాలకు వచ్చి సమస్య తెలుసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా కుల,మత, రాజకీయ పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని తెలిపారు. నాలుగున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాలను వివరించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. ప్రజల వద్దకే సేవలు.. లబ్ధిదారులు వద్దకే ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే వీటిని నిలుపుదల చేస్తుందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సంక్షేమాన్ని అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి మళ్ళి ఎన్నుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జైతి రాజులమ్మ ,డైరెక్టర్ అచ్యుత్, ఎంపీపీ బడుగు రమేష్ ,వైస్ ఎంపీపీ అంబటి నూకాలమ్మ, వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ ,మండల ప్రెసిడెంట్ జల్లి బాబులు, బీసీ డైరెక్టర్ గాడి నాగమణి ,ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి ,మండల కన్వీనర్ బండి సుధాకర్, జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ నీలాపు సూరిబాబు, సర్పంచులు ఆర్ ముసలి నాయుడు, జంపా రాజకుమారి ,కూడా చిన్న తల్లి ,సొర్ల,చందు, రావుల సింహాచలం, కుర్జు పెంటమ్మ ,ఎంపీటీసీ చెడ్డ మల్లేశ్వరి ,సోషల్ మీడియా కో కన్వీనర్ గాడి అచ్చిరాజు, నాయకులు గాడి సత్యనారాయణ, వనం బాబు ,ధూపం శ్రీను, ఏ రామరాజు ,వార్డు మెంబర్ బంటు బుజ్జి ,గొట్టిపల్లి లక్ష్మి, కే లక్ష్మణరావు, మాధుల ఉష ,అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు , వైయస్సార్సీపి కార్యకర్తలు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]