కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆమె తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల అని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని నిర్ణయించేందుకు తొలి సారిగా రాజ్యాంగ సవరణ చేస్తూ రాజీవ్ గాంధీ బిల్లును తీసుకొచ్చారని సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. సరోజినీ నాయుడు, సుచేత కృపాలనీ, ఆరుణాసఫ్ ఆలీ, విజయలక్ష్మీ పండిట్ వంటి వారెందరో దేశం కోసం పోరాడారని గుర్తు చేశారు. నూతన పార్లమెంట్ భవన్ లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోనియా గాంధీ ఈవ్యాఖ్యలు చేశారు. మహిళలు వారి స్వార్ధం గురించి ఏనాడు ఆలోచించరు, మహిళా రిజర్వేషన్ బిల్లు ను కాంగ్రెస్ సమర్థిస్తోందన్నారు.
in Latest News, Main News
స్త్రీల త్యాగాలు ఎనలేనివి -సోనియా గాంధీ

