Rahul, Soniya గద్దర్ కుటుంబాన్నికాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పరామర్శించారు. సీడబ్ల్యుసీ సమావేశాల వేదిక తాజ్‌కృష్ణలో గద్దర్ భార్య విమల, కుమారుడు సూర్యం, కూతురు వెన్నెలలను వారు ఓదార్చారు. గద్దర్ కుమారుడు సూర్యం మాట్లాడుతూ, గద్దర్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని సోనియా, రాహుల్‌గాంధీలు గుర్తు చేసుకున్నారని, భవిష్యత్తులో ఇంటికి వచ్చి కలుస్తామని వారికి చెప్పడం జరిగిందన్నారు.