అధికార బీఆర్ఎస్ మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతారావు పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు బీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టు మైనంపల్లి.. సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ఈనెల 26న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయం అయింది.