మాచర్ల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలసియున్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఉచిత గణపతి ప్రతిమలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతో దోహదపడతాయని అన్నారు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులకే వినాయక చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
[zombify_post]