ఆగస్టు 29వ తేదీ మాచర్ల నియోజకవర్గం గొట్టిపాళ్లలో వైసిపి టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ నేపథ్యంలో ఇప్పటికే టిడిపి కార్యకర్తలపై 307 తో పాటుగా మరికొన్ని సెక్షన్లతో కేసు నమోదు జరిగింది. గత నాలుగు రోజుల క్రితం ఇదే కేసులో A10 గా అజ్ఞాతంలో ఉన్న రాజబోయిన మధు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో A12 గా మాచర్ల టిడిపి ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి తో పాటుగా మరొక ఐదుగురిని ముద్దాయిలుగా రిమాండ్ రిపోర్టు లో పేర్కొన్నారని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో బ్రహ్మారెడ్డి పేరు చేర్చటం రాజకీయ కక్ష సాధింపు చర్యగా అభివర్ణిస్తున్న టీడిపి నాయకులు. ఇదే గొడవల్లో వైసీపీ నాయకుల మీద నామమాత్రపు సెక్షన్లు పెట్టి టీడిపి కార్యకర్తల పై, నాయకుల పై హత్యాయత్నం కేసు నమోదు చేయడంతో పోలీసు వ్యవస్థ అధికార పక్షానికి ఒకలా ప్రతి పక్షానికి మరోలా పనిచేస్తుందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!