in , , , ,

గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ కలకలం

గుంటూరు వైద్య కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం సృష్టించింది. కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధించినట్లు తెలుస్తోంది..

దీంతో ప్రిన్సిపల్‌తో పాటు జాతీయ మెడికల్ కమిషన్‌కు విద్యార్థిని ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. గతేడాది కూడా కళాశాలలో జూనియర్ విద్యార్థిపై సీనియర్ ర్యాగింగ్ చేయగా ఇలాగే ఫిర్యాదు వెళ్లింది. మెడికల్ కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాలతో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మళ్లీ ఈ ఏడాది కూడా ర్యాగింగ్ పునరావృతం కావడం గమనార్హం. కాగా, ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెల రోజుల క్రితమే తరగతులు మొదలయ్యాయి. ఈలోపే ర్యాగింగ్ ఘటన చోటుచేసుకోవటం విద్యార్థులను ఆందోళనకు గురి చేస్తోంది.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Newbie

Written by Allagadda CM news

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author

అమెరికా లో ప్రారంభమైన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు

చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్‌