- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో ఆదివారం దారుణం జరిగింది. భీమవరం పట్టణంలోని గొల్లవాని తిప్ప రోడ్డు కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో నడి రోడ్డు మీద దేవర విజయ్ (23) అనె వ్యక్తి ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి హత్య చేశారు. మృతుడు పట్టణంలోని గాంభీర్ దొడ్డికి చెందిన వ్యక్తి అని, పాత నేరస్తుడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై భీమవం పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[zombify_post]