రెంటచింతల మండల కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము సైతం బాబు వెంటే నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రంలో లక్షలాదిమంది యువతి యువకులు శిక్షణ పొందారని అన్నారు ఆ శిక్షణ ద్వారా వేలాది మంది యువకులు ఉన్నత ఉద్యోగాలు సంపాదించాలని అన్నారు. తాను 16 నెలలు జైలు జీవితం గడిపానని అందరినీ జైలు జీవితం గడిపేలా చేయాలని కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై కేసులు నమోదు చేయించి జైలు పాలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పెట్టిన అక్రమ కేసులపై కోర్టులు మొట్టికాయలు వేసినా సరే తన ధోరణి మార్చుకోకపోవడం మూర్ఖుత్వానికి నిదర్శనం అన్నారు ప్రభుత్వాన్ని సాగనంపేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ నిరసన దీక్షలో సిపిఐ నాయకులు శ్రీనివాస్ రెడ్డి రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]