దుర్గి మండల పరిధిలోని అడిగోప్పల గ్రామం శివారు నిదానంపాడు అగ్రహారంలో వేంచేసియున్న అడిగోప్పల శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి హూండీ కానుకలను లెక్కించగా రూ.20,31,890/-
ఆదాయము వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాణాధికారి శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు. 43 రోజుల పాటు భక్తులు అమ్మవారిని దర్శించుకుని కానుకలు, మొక్కుబడులు హూండీల్లో సమర్పించుకున్నారు. గురువారం ఆలయ ముఖమండపంలో పర్యవేక్షణాధికారిగా పేటసన్నిగళ్ళ గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి సైదమ్మ బాయి గారి ఆధ్వర్యంలో హూండీల లెక్కింపు చేపట్టారు. ఆలయ సిబ్బంది నగదును డీనామినేషన్ ప్రకారం వేరుచేసి కట్టలు కట్టారు. నగదును బ్యాంకు అధికారులు కౌంటింగ్ మిషన్ ద్వారా లెక్కింపు చేసుకుని అమ్మవారి ఖాతాలో జమచేసి రశీదును ఆలయ అధికారులకు అందజేశారు. హుండీ లెక్కింపులో ఆలయ అధికారులు మరియు కరాలపటి సుబ్బారావు, కలవల వెంకటేశ్వర్లు, NMR సిబ్బంది, అర్చక, పరిచారిక, నాయి బ్రాహ్మణులు, భక్తులు, పాల్గొన్నారు.
[zombify_post]