- కరీంనగర్ జిల్లా
ఆపదలో ఉన్న మహిళలకు వెంటనే సహాయాన్ని అందించడానికి సిద్దంగా ఉండాలి
జిల్లా కలెక్టర్ డాః బి. గోపి
0 0 0 0 0
జిల్లాలో ఎక్కడైన మహిళలు ఆపదలో ఉన్నట్లుగా తెలిస్తే వెంటనే స్పందించి తగిన సహాయాన్ని అందించడానికి సఖీ కేంద్రం సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాః బి. గోపి తెలిపారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సఖీ జిల్లా మేనేజ్మెంట్ 9వ సమావేశంలో జిల్లా కలెక్టర్ డాః బి. గోపి ముఖ్యఆతిధిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, ఇబ్బందులు, ఆపదలో ఉంటే వెంటనే 181 నెంబరు కు మహిళలు ఫోన్ చేసినట్లయితే వెంటనే స్పందించి తగిన సహాయ సహకారాలను అందించడానికి సఖి బృందాలు సిద్దంగా ఉండాలని సూచించారు. జిల్లాలో అన్ని శాఖలు సమన్వయంతొ పనిచేయాలని, అన్ని రకాల కేసులలో సత్వరం స్పందించడానికి కృషిచేయాలన్నారు. సఖీ కేంద్రాని వచ్చే కేసులలో అలస్యం లేకుండ సత్వరం పరిష్కరించి వారిని తగిన న్యాయం అందించగలగాలన్నారు. జిల్లాలో నిర్మిస్తున్న సఖీ భవన నిర్మాణ పనులను త్వరలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు. సఖీ కేంద్రానికి వచ్చే మహిళల సమస్యలను తెలుసుకొని వాటిని సానుకూలంగా పరిష్కరించేలా చూడాలన్నారు. సఖీ కేంద్రం ద్వారా అందించే సహాయ సహకారాలకు సంబంధించి అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా ఇంచార్జి డిఆర్ఓ పవన్ కుమార్, ఎడిసిపి రాజు, పిడి మెప్మా రవీందర్, జిల్లా లీగల్ బార్ అసోసియోషన్ సభ్యులు బి. రఘునంద్ రావు, షెడ్యూల్డ్ కులాల అభివృద్ది అధికారి నతానియోల్, డిడబ్ల్యుఓ సరస్వతి, సఖీ కేంద్రం నిర్వహకురాలు లక్ష్మీ, ఎన్ జి ఓ కొండవీటి సత్యవతి, అదనపు జిల్లా వైద్యాధికారి డాః జి సుజాత, డిటిడిఓ గంగారాం, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]