అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలంలోని జాంగూడ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పద్దు నయోమి అనే గిరివిద్యార్థిని స్వగ్రామమైన గసభలో శనివారం అకస్మాత్తుగా మృతి చెందినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో ఆరోగ్యంగానే ఉంటూ వారి గ్రామానికి వెళ్ళిన తర్వాత గత శనివారం అస్మాత్తుగా మృతి చెందడంతో దీనిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అనారోగ్యంతో మృతి చెందిందా లేక ఇతర వేరే కారణాలతో చెందిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం ఆలస్యంగా బయటకు తెలియడంతో స్థానిక గిరిజన సంఘాలు, మహిళ సంఘాలుతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్ధిని మృతికి కారణాలపై పాఠశాలలో సందర్శించి ఆరా తీస్తున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధిత విద్యార్థిని తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జాంగుడ ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పి నయోమి విద్యార్థిని మృతిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని ప్రధానోపాధ్యా యురాలిని సస్పెండ్ చేయాలని ఆదివాసి గిరిజన మహిళ జిల్లా అధ్యక్షురాలు వి విజయ, ప్రధాన కార్యదర్శి హైమ డిమాండ్ చేశారు.
[zombify_post]