అల్లూరి సీతారామరాజు జిల్లా లో గంజాయి నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలంతా సహకరించాలని అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు. బుధవారం ఆయన పాడేరు లోని తన కాటర్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ…. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడిన దాని మూలాలు అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచే అవుతుందన్నారు. గంజాయి నివారణ కు ఇప్పటికే తోటలు ధ్వంసం తో పాటు సాగు నివారణ కు చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే గంజాయి రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. అయినా ఇంకా జిల్లా లో గంజాయి సాగు, రవొణా జరుగుతుందని, దీనిని నివారించేందుకు టోల్ ప్రీ నెంబర్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి సాగు, రవాణా జరుగుతుంటే 9381123100 నెంబర్ కు ఎవ్వరైనా ఫోన్, మెసేజ్, వాట్సాప్ చేయవచ్చని తెలిపారు. గంజాయి వివరాలు తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
[zombify_post]