ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ సర్కార్ : కౌన్సిలర్ ఖాలిక్
నందిగామ సెప్టెంబర్ 13 గురు న్యూస్

నందిగామ పట్టణంలోని 3 వార్డులో కౌన్సిలర్ షేక్ ఖాలీక్ ఆధ్వర్యంలో వైఎస్సార్ నూతనంగా మంజూరైన పెన్షన్ను వార్డులోని ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఖాలిక్ మాట్లాడుతూ మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా నిలిచారని, ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో వైయస్ జగన్ సర్కార్ పెద్దపీట వేశారని అలాగే మన నందిగామ ఎమ్మెల్యే జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ ఎల్లవేళలా ఎప్పుడూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నందిగామ అభివృద్ధికి బాట వేశారని నందిగామ నియోజకవర్గ ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సచివాల సిబ్బంది వైఎస్ఆర్సిపి నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు.
[zombify_post]