అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతుగూడెం పోలీస్ స్టేషన్ చెక్‌పోస్టు వద్ద రెండు వేర్వేరు ఘటనల్లో 32 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై జి.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… మోతుగూడెం చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ముందుగా చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని ఇంతులూరువాగు గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రెండు ద్విచక్ర వాహనాల్లో తరలిస్తున్న పది కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 50 వేలు ఉంటుందన్నారు. ఈ కేసులో తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లాకు చెందిన శివకుమార్, తిరుపతి, రాకేష్, సంపత్… చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని ఇంతులూరువాగు గ్రామానికి చెందిన కిలో సోమనాథ్, పాంగి గోపాల్‌ను అరెస్ట్ చేశారు. మరో ఘటనలో ద్విచక్ర వాహనంపై ఒడిశా రాష్ట్రంలోని గుంటవాడ నుంచి బెంగుళూరుకు తరలిస్తున్న 22 కేజీల గంజాయిని పట్టుకున్నారు. దీని విలువ రూ. 1.10 లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించి బెంగుళూరుకు చెందిన అనసీర్ పీవీ, ఒడిశా రాష్ట్రం గుంటవాడకు చెందిన వంతల గురును అరెస్టు చేశారు
[zombify_post]