in ,

ది ఎబిలిటీస్ పీపుల్ ” సేవలు ప్రశంసనీయం : పాడేరు శాసనసభ్యులు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి

పాడేరు, అల్లూరి జిల్లా:
ప్రత్యేక ప్రతిభావంతులకు "ది ఎబిలిటీస్ పీపుల్" స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని పాడేరు శాసనసభ్యులు  కొటగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు.
వికలాంగులకు వీల్ చైర్స్, కృత్రిమ అవయవ పరికరాల పంపిణీ శిబిరాన్ని ఎబిలిటీస్ పీపుల్ స్వచ్ఛంద సేవా సంస్థ శనివారం చింతపల్లిలో ఏర్పాటు చేసింది. ఈ శిబిరాన్ని పాడేరు శాసనసభ్యులు  భాగ్యలక్ష్మి ,  ఏ ఎస్ పి ప్రతాప్ శివ కిషోర్ సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ
ప్రత్యేక ప్రతిభావంతులకు వివిధ రకాలుగా సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ది ఎబిలిటీ పీపుల్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ పాత్రో కి ధన్యవాదాలు తెలిపారు. తాము గడపగడపకు వెళ్ళినప్పుడు పెన్షన్ పొందేందుకు అన్ని అవకాశాలు ఉన్నా తమకు పెన్షన్ రావడం లేదనే విషయాన్ని  తెలియజేసినప్పుడు సదరన్ క్యాంపులో ఏ విధంగా బుక్ చేసుకోవాలి… అనంతరం పింఛన్  పొందేందుకు ఉన్నటువంటి మార్గాలను ప్రతిదీ తెలియజేసేవారమన్నారు. ఈ పరిస్థితులను అధిగమించడం కోసం కలెక్టర్, ఎస్పీలతో గతంలో చర్చించి రాష్ట్రంలో ఎక్కడ చేయలేని విధంగా ప్రత్యేకంగా రెండు క్యాంపులలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.   రెండు రోజులు పాటు నిర్వహించిన సదరన్ క్యాంప్ ల్లో ఎంతోమంది టెస్ట్ చేయించుకొని ఈరోజు మా చేతుల మీదుగా వాళ్లందరికీ పెన్షన్ ఇస్తూ ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. 3000 రూపాయలు కొత్త పెన్షన్ల వారికి ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నామన్నారు.  మేము గడపగడపకు వెళ్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ తమ వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకొని వదిలేయకుండా వాటి పరిష్కారానికి చొయవ చూపడం నిజంగా సంతోషదాయకమని ప్రజలంతా చెబుతున్నారన్నారు. ఈ విషయంలో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. వారి మాటల వల్ల మరో పదిళ్లులు ఉత్సాహంగా తిరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయన్నారు. తాము సదరన్ శిబిరం ఏర్పాటు చేసినప్పుడు ది ఎబిలిటీ పీపుల్ స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు కూడా ఆ శిబిరంలో పాల్గొని తామంతా వికలాంగులకు సహకారం అందిస్తామని వీల్ చైర్స్ గాని కృత్రిమ అవయవాలు వంటివి అందిస్తామని చెప్పి కొలతలు తీసుకున్నప్పుడు ఇదంతా జరుగుతుందా? అనే ఒక ఆలోచన వచ్చిందని, ఇప్పుడు ఈరోజు దాని అమలు చేస్తున్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఇంత భారీ ఎత్తున సహాయ సహకారాలు ప్రత్యేక ప్రతిభావంతులకు అందించేందుకు ముందుకు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

జగనన్న ఆరోగ్య సురక్ష పై అవగాహన కల్పించండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఓ కార్యక్రమాన్ని తీసుకొస్తుందని అదే జగనన్న ఆరోగ్య సురక్ష అని దీనిపై ప్రతి ఒక్కరూ ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు చెప్పారు. దీనికి సంబంధించి నిన్న 15వ తారీకు నుంచే వాలంటీర్ల ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని  ఈరోజు నుంచి ఆయా పరిధిలో ఉన్న ఏ ఎన్ ఎం లు,  ఈ హెచ్ ఓ లు ఆరోగ్య కార్యకర్తలు అంతా ఇంటింటికి వచ్చి సర్వే చేస్తున్నారని తెలిపారు. ఈ సర్వేలో ప్రతి ఇంటికి తిరిగి వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై వివరాలను నమోదు చేస్తారని వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక వైద్యనిపుల నిపుణుల సమక్షంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. ప్రతి సచివాలయంలో రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు.  ఈ ప్రక్రియ వచ్చే నెల 3న  ప్రారంభమై  నెలరోజుల పాటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో కంటే ప్రస్తుతం అల్లూరి జిల్లాలో వైద్య పరిస్థితులు మెరుగుపడ్డాయన్నారు. గతంలో ఏదైనా చిన్నపాటి కేసు వచ్చిన విశాఖ కేజీహెచ్ రిఫర్ చేసే పరిస్థితి ఏజెన్సీలో ఉండేదని కానీ నేడు పాడేరు జిల్లా ఆస్పత్రిలోనూ చింతపల్లి సిహెచ్ ఎస్ లో కూడా ఆపరేషన్ జరుగుతున్నాయని అది మన ప్రభుత్వంలోనే ప్రారంభమైందన్నారు. వైద్యరంగంలో తీసుకువచ్చినటువంటి సమూల మార్పులతోటి ఇవన్నీ సాధ్యమైందన్నారు. పాడేరులో మెడికల్ కాలేజీ త్వరలో అందుబాటులోకి రాబోతుందని అది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని వచ్చే సంవత్సరం అడ్మిషన్స్ ప్రారంభమవుతాయన్నారు. తాజాగా నిన్ననే ఐదు మెడికల్ కాలేజ్ లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందన్నారు . ఈ సంవత్సరం నుంచి వాటిలో అక్కడమిక్ తరగతుల ప్రారంభం కానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత , ఎంపిపి కొరాబు అనూష దేవి, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్,  మండల ప్రెసిడెంట్ మోరి రవి, ఎంపీటీసీలు దాసరి ధారలక్ష్మి, సూరిబాబు, రూతు, పి.బాబురావు, కో ఆప్షన్ నెంబర్ ఎస్కే నజీర్ వలి, స్వచ్చంద్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్కే మీరా, ఏఎంసి డైరెక్టర్ అప్పన్న, వైస్ ఎంపీపీ వెంగళరావు, జీకే విధి ఎంపీపీ బోయిన కుమారి,  ట్రైకార్ డైరెక్టర్స్ సుర్ల లోవరాజు, సర్పంచులు ఎస్ లక్ష్మయ్య, కె రఘునాథ్ , పి సన్యాసిరావు,  పి గణబాబు,  ఎల్ పండయ్య, వైస్ సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

నిడదవోలు పర్యటన లో సీఎం జగన్ ఔదార్యం

రణమండల కొండ మీద వెలసిన ఆంజనేయ స్వామికీ ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మాజీ ఇంచార్జ్ గుడిసె అది కృష్ణమ్మ