in , ,

భారీ వర్షానికి అల్లూరి జిల్లా అతలాకుతలం

అల్లూరి సీతారామరాజు జిల్లా లో మంగళవారం జిల్లాలో 312.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంచంగిపుట్టు మండలంలో అత్యధికంగా 85.8 మిల్లీమీటర్లు, పెదబయలులో 52.8, చింతూరు 33.4, డుంబ్రిగుడ 26.2, గంగవరం 26, మారేడుమిల్లి 16.4, అరకులోయ 12.6, వై.రామవరం 10.8, అడ్డతీగల 9.6, అనంతగిరి 9.2, జి.మాడుగుల 4.4, కూనవరం 4, రంపచోడవరం 4, హుకుంపేట 3.2, చింతపల్లి 2.4, కొయ్యూరు 2.4, ఎటపాక 2.8, జీకే వీధి 2.2, వి.ఆర్‌.పురం 1.8, రాజవొమ్మంగి 1.0, పాడేరు 0.8, దేవీపట్నంలో 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.కొట్టుకుపోయిన వంతెన
జి.మాడుగుల మండలంలో బొయితిలి పంచాయతీ మద్దిగరువు గ్రామం వద్ద వంతెన కొట్టుకుపోయింది.దీంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సంతబయలు గ్రామంలో వారపుసంత వర్షపు కారణంగా అంతంత మాత్రంగా జరిగింది. కొడిమామిడి గెడ్డ, సంఘంగెడ్డ, మత్స్యగెడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. గెడ్డల సమీపంలో గల పంటపొలాలు నీటి మునిగాయి.           ఉధృతంగా కొండ వాగులు, గెడ్డలు
భారీగా వర్షాలు కురుస్తుండడంతో జిల్లాలోని పలు ప్రధాన గెడ్డలు, వాగులు వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లోని గెడ్డల్లో వరద ప్రవాహం ప్రమాదకరంగా ఉండడంతో మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం-బుంగాపుట్టు రోడ్డులో సుత్తిగెడ్డ వరద ఉధృతితో రెండు రోజుల నుంచి ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలోని ప్రధాన మత్స్యగెడ్డలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. మత్స్యగుండంలో భక్తుల సందర్శనను నిలిపివేశారు. హుకుంపేట మండలంలోని రాళ్లగెడ్డ, దిగుడుపుట్టు గెడ్డలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హుకుంపేట నుంచి అరకు వెళ్లే రోడ్డులో మాసాడ కల్వర్టు మీదుగా వరదనీరు ప్రవహించడంతో వాహనాల రాకపోకలు సాగించారు.

[zombify_post]

Report

What do you think?

బూమ్ -బూమ్ బీరు పై సంచలన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు

నేడు జగిత్యాల జిల్లా లో ఎమ్మెల్సీ కవిత పర్యటన