తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం 2023 ను పురస్కరించుకొని తెలుగు వెలుగు విశిష్ట కళా రత్న జాతీయ పురస్కారానికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముత్యాల ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు.ముత్యాల ప్రభాకర్ రెడ్డి పల్లవి ఫోటో స్టూడియో నిర్వహిస్తూ తన ఫోటోగ్రఫీలో తీసినటువంటి ఫోటోలు అదేవిధంగా పల్లె జీవన చిత్రాలు,వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంస్కృతులు,తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల పైన తీసినటువంటి ఫోటోలు ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభను గుర్తించి తెలుగు వెలుగు విశిష్ట కళా రత్న జాతీయ గౌరవ పురస్కారానికి ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.పురస్కారాల ప్రదానోత్సవం ఈనెల17న ఆదివారం త్యాగరాయ గానసభ కళా దీక్షితులు కళావేదిక చిక్కడపల్లి హైదరాబాద్ లో తెలుగు వెలుగు సాహితీ వేదిక జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ అతిథుల విశిష్ట కళా రత్న జాతీయ పురస్కారం ప్రధానం చేస్తారు. ఈ సందర్భంగా మిత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
[zombify_post]