- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ ను గురువారం దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల యువమోర్చా అధ్యక్షులు జితేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ 2014లో ఇచ్చిన హామీలు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని , నిరుద్యోగ భృతి నీ వెంటనే అమలు చేయాలని బుధవారం కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గంగాపురం కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్షలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఉపవాస దీక్షను అక్రమంగా అడ్డుకొని ఒక కేంద్రమంత్రి అని చూడకుండా దాడులు చేస్తూ అక్కడున్న కార్యకర్తలను కూడా అరెస్ట్ చేయడం అన్యాయం అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పి ప్రజలను నిరుద్యోగులను మోసం చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కే దక్కుతుందన్నారు.ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సనత్ లక్ష్మణ్, ఉపాధ్యక్షులు బాలకిషన్, సురేష్,కార్యదర్శి ఎలంధర్, రాకేష్,వినోద్, సాయి, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]