హోంగార్డు రవీందర్ మొన్న హైదరాబాదులో అనుమానాస్పదంగా మృతి చెందగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రవీందర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా తమ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల మంది హోంగార్డు ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రవీందర్ ఆత్మహత్యకు కారణమైన నిందితులను రిమాండ్ చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన మండల అధ్యక్షులు బానోతు రాజు నాయక్, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, బీసీ సెల్ అధ్యక్షుడు అనవేని రవి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు శ్రీను, రాథోడ్, ప్రశాంత్, మూన్ సింగ్, రాథోడ్, తిరుపతి గౌడ్ తదితరులు ఉన్నారు.
[zombify_post]