in ,

వార్షిక తనిఖీల్లో భాగంగా సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ*

  1. రాజన్న సిరిసిల్ల జిల్లా :వార్షిక తనిఖీల్లో భాగంగా సిరిసిల్ల రూరల్ సర్కిల్ కార్యాలయన్ని తనిఖీ చేసి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో నమోదు అవుతున్న కేసుల వివరాలు,అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న సిడి ఫైల్స్ ను,పెండింగ్ ట్రాయల్లో ఉన్న సిడి ఫైళ్లను,గ్రేవ్ కేసెస్ లలో ఉన్న సిడి ఫైళ్లను పరిశీలించి, పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు.
    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తు ప్రజా సేవకు అంకితం కావాలి, ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని విలేజ్ పోలీస్ అధికారి నిత్యం తనకు కేటాయించిన గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలన్నారు. సర్కిల్ పరిధిలోని అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలన్నారు. ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్ ఉండాలని కేసులలో శిక్షణ శాతం పెంచాలని తద్వారా నేరాలను అదుపు చేయవచ్చు అన్నారు.రాబోవు పండుగలు, ఎన్నికల సందర్భంగా సర్కిల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రణాళికతో పకడ్బందీగా విధులు నిర్వహిచాలని,అదేవిధంగా సర్కిల్ పరిధిలోని పాత నేరస్థులఫై,సస్పెక్ట్ ,రౌడి షీట్స్ మీద నిఘా ఉంచాలన్నారు.ఎస్పీ  వెంట రూరల్ సి.ఐ సదన్ కుమార్, ఎస్.ఐ వెంకటేశ్వర్లు సిబ్బంది ఉన్నారు.

[zombify_post]

Report

What do you think?

Newbie

Written by Mahesh

Creating Memes
Creating Polls
Creating Quizzes
Creating Gifs
Top Author
Post Views

పెందుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

మాచినేని కోటేశ్వరరావుతో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది