తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా సింగరేణి మండలంనకు చెందిన నిందితులు బాణోత్ లక్ష్మణ్ సింగ్, బాణోత్ శ్రీను, బాణోత్ సరోజ, తేజావత్ దేవి, అజ్మీర్ లక్ష్మీలకు మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసిన కేసులో 20 సంవత్సరాల పాటు జైలుశిక్షతో పాటు రూ.25,000/- జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి కె.ఉమాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు సింగరేణి మండలంనకు చెందిన ఫిర్యాదికి ముగ్గురు సంతానం. తమ ఇంట్లో నిద్రిస్తున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసారని ది 1-2 -2021 న కారేపల్లి పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి పోలీసులు కేసును విచారించి నిందితులపై కోర్టులో చార్జీషీట్ దాఖలు చేసారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులపై నేరం రుజువు కావడం తో పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొత్త వెంకటేశ్వరరావు వాదించగా, లైజన్ ఆఫీసర్ వి.భధ్రు నాయక్, కోర్టు కానిస్టేబుల్ టి.వెంకటేశ్వరరావు, హోంగార్డు ఎం.డి.ఆయూబ్ లు సహకరించారు.
[zombify_post]