బాధిత కుటుంబానికి బండలింగంపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 2004-05వ సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులు కలిసి డబ్బులు పోగు చేసి 16 వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ రేసు బాబు ఇటీవల అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందడంతో భార్య రేసు వనిత ముగ్గురు పిల్లలు అనాధలుగా మిగిలారు. చిన్ననాటి స్నేహితులు కలిసి జమ చేసిన నగదు మొత్తాన్ని ఆదివారం రేసు వనిత ఇంటికి చేరుకొని 16 వేల ఆర్థిక సహాయాన్ని వార్డు సభ్యులు సురేష్, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాసులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
[zombify_post]