అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట జోనల్ ప్రవేటు స్కూల్స్ మేనేజ్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆలమూరు మండలం చెముడులంక శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల అధినేత ఉమారాణిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం షిర్డీ సాయి స్కూల్లో జోనల్ ప్రవేటు స్కూల్స్ మేనేజ్మెంట్ సమావేశం జరిగింది. మండపేట జోన్ పరిధిలో గల మండపేట, కొత్తపేట, అనపర్తి నియోజకవర్గాలకు చెందిన 10 మండలాల పరిధిలో గల 140 ప్రైవేట్ స్కూల్స్ చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాల నిర్వహణలో సుదీర్ఘ అనుభవం కలిగిన న్యాయవాది ఉమారాణిని చైర్మన్‌గా వారంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా మండపేట అక్షర స్కూలు అధినేత వి.రాంబాబు, కోశాధికారిగా రావులపాలెం మండలం అంకంపాలెం ఆదిత్య స్కూల్ అధినేత పి.రమేష్ ను ఎన్నుకున్నారు. మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుంటామని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం లీగల్ అడ్వైజర, కాకినాడ ఎంఎస్ఎన్ టెక్నో స్కూల్ అధినేత ఎం. శ్రీ విజయ్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే రాజమహేంద్రవరం,కడియం శ్రీ షిర్డీ సాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, ఆలమూరు సిద్ధార్థ స్కూల్స్ అధినేత ముల్లారావు, మండపేట విద్యా వికాస్ అధినేత సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్ అడ్వైజర శ్రీ విజయ్‌ను మండపేట జోనల్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్య ఘనంగా సత్కరించింది.ఈ సమావేశంలో ఇప్పటి వరకూ ప్రెసిడెంట్ గా ఉన్న పి.శ్రీనివాసరావు (ద్వారపూడి సిద్దార్థ), కార్యదర్శి జి.తాత రాజు( మండపేట సుమేధ),కోశాధికారి ఎన్.దత్తాత్రేయలు( రావులపాలెం శ్రీ వివేకానంద) తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]