in ,

విద్య, సమాజ సేవా రంగాల్లో చిత్తలూరి అభినందనీయుడు

ప్రభుత్వ విద్యారంగానికి,  సత్తుపల్లి పట్టణం, పరిసర ప్రాంతాల్లో  సమాజానికి  గత 30 సంవత్సరాలుగా వివిధ సమయాల్లో అందించిన  సేవలు అభినందనీయమని సత్తుపల్లి జడ్పిటిసి కుసంపూడి రామారావు పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన చిత్తులూరి ప్రసాద్ ను ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుకున్న పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా వచ్చి  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల  రెండు కోట్ల నిధుల ను, ప్రధానమంత్రి శ్రీ పథకం కింద పాఠశాలను  ఎంపిక కావడానికి పాఠశాల అభివృద్ధికి చిత్తలూరు చేసిన కృషి , పూర్వ విద్యార్థుల, దాతల  సహకారంతో ప్రాథమిక పాఠశాలలో డిజిటల్ రూమ్ ఏర్పాటు చేయడం, తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ విగ్రహం ఏర్పాటు, తరగతి వారి విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల ద్వారా విద్యార్థుల ప్రగతిని, తల్లిదండ్రుల సమక్షంలో ప్రతిరోజు తెలియపరచడం, విద్యా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం  చిత్తలూరికే సాధ్యమైందని, కేరళ వరద బాధితులకు 13 లక్షల రూపాయలు పట్టణం నుండి సేకరించి నేరుగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ కు  త్రివేండ్రం వెళ్లి అందజేయడం, బాసర అగ్ని బాధితులకు  7 ఇల్లు నిర్మించడం, కోవిడ్ సమయంలో స్వచ్ఛంద సంస్థల సమన్వయకర్తగా  అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి  ఈ ప్రాంత ప్రజల  మన్ననలను పొందడం, తెలంగాణ ఉద్యమంలో ప్రసాద్ పాత్ర ప్రశంసనీయమని, ఉపాధ్యాయ సంఘ నాయకుడుగా ఉపాధ్యాయులకు సేవలందించడం  పట్ల ప్రసాద్ అభినందనీయుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయులు బలుసు అచ్చయ్య, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ పాశం వెంకటేశ్వరావు, ఉపాధ్యాయులు  నాగమణి, జయశ్రీ, లాల్ అహ్మద్, పవన్, సాంబశివరావు, నరసింహారావు  మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయ భద్రతపై ఆక్టోపస్ కమాండోస్ సమీక్ష సమావేశం నిర్వహించారు

గెస్ట్ లెక్చ‌ర‌ర్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం జిల్లా క‌లెక్ట‌ర్ సుమిత్ కుమార్‌