in

విద్యా బోధన సమాజ సేవ ఉపాధ్యాయుల లక్ష్యం కావాలి

ఉత్తమ  ఉపాధ్యాయుల అభినందన సభ
విద్యార్ధులు చదువుకుంటూ సామాజిక సేవా భావనను కలిగి ఉండాలని ఇందుకు ఉపాధ్యాయుల కృషి ఎంతగానో దోహదపడుతుందని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షౌకత్ అలీ అన్నారు. సత్తుపల్లి లోని విశ్వశాంతి విద్యాలయంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు చిత్తలూరి ప్రసాద్, కంభంపాటి వెంకటేష్ ల అభినందన కార్యక్రమం జరిగింది. సృజన సాహితీ సమాఖ్య అధ్వర్యంలో పసుపులేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో షౌకత్ అలీ మాట్లాడుతూ  జిల్లా అవార్డు స్వీకరించిన చిత్తలూరి ప్రసాద్, వెంకటేష్ ఇరువురు పాఠశాలల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ,సమాజ సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారని అన్నారు. కూసుమంచి మండల పోలీసు సబ్ ఇన్స్ పెక్టర్ క్రిష్ణప్రసాద్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ప్రసాద్ చేస్తున్న సేవలను జిల్లా అధికారులు గుర్తించి అవార్డు అందచేసారని అన్నారు. అవార్డు గ్రహీతలను పూలమాలలు , శాలువాలతో సృజన సత్కరించింది. వారి సేవలను అభినందించారు. సృజన బాధ్యులు వాసు, రామకృష్ణ, జాతీయ అవార్డు గ్రహీత మధుసూదనరాజు, విశ్వశాంతి విద్యాలయ యాజమాన్యం సత్యనారాయణ, అవినాష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు.

[zombify_post]

Report

What do you think?

నాగావళి నదిలో పెరుగుతున్న నీటి మట్టం

హుస్నాబాద్ శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు