హైకోర్టు లో ఘనంగా బోనాల ఉత్సవాలు
పాల్గొన్న న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాల పండగ ఓ భాగమని న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం హైకోర్టు లోని నాగమాత ఆలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. అంతకుముందు హైకోర్టు లైబ్రరీ ను మంత్రి సందర్శించారు.

[zombify_post]