మాచినేని కోటేశ్వరరావు గారితో ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది, వారి మరణం చాలా బాధాకరమని మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్ అన్నారు. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి మాచినేని కోటేశ్వరరావు ఇటీవల మరణించగా వారి స్వగృహం నందు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కోటేశ్వరరావుతో తనకున్న అనుబంధం చాలా ప్రత్యేకమైనదని గుర్తుచేస్తూ ఆయన కుమారులు మాచినేని రాజా, మాచినేని రంజిత్, కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వడ్లమూడి కృష్ణయ్య, కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నున్నా సురేష్, మాచినేని జనార్ధన్ రావు, డాక్టర్ రవి, భోగి నరసింహారావు, పకీర్ సాహెబ్, గొల్లమండల పీరయ్య, మందా రాఘవ, నక్కా ప్రవీణ్, బల్లి కాసులు, గాయం నాగేశ్వరరావు, నీలాల నీలాద్రి, గరగొట్టి కృష్ణ, నల్లబోతుల రాంబాబు, Sk రంజాన్ వలి( కనువూరు), కొనకళ్ళ పెద్ద వెంకటేశ్వరరావు, పులి లింకన్, జోనెబోయిన వెంకటేశ్వరరావు, గడ్డం సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]