కొత్తగూడెం: విద్యుత్ పోరాట అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యుత్ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం కొత్తగూడెం పట్టణంలోని మంచి కంటి భవన్లో సత్తెనపల్లి రామకృష్ణ 23వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2000 సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు విధానాలలో భాగంగా విద్యుత్ చార్జీలు పెంచడానికి ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోరాటాలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని గడగడలాడించాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను సమీకరించి హైదరాబాదులో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడుతుండగా నరహంతక చంద్రబాబు ప్రభుత్వం జరిపిన కాల్పుల్లో విష్ణువర్ధన్ బాలస్వామి అక్కడికక్కడే మరణించగా సత్తెనపల్లి రామకృష్ణ చాతిలో తోట దిగి హాస్పిటల్లో చికిత్స పొందుతూ 12 రోజుల తర్వాత మరణించారని ఆయన అన్నారు. నాటి విద్యుత్ పోరాట అమరవీరుల త్యాగాల ఫలితమే 20 సంవత్సరాల వరకు ఏ ప్రభుత్వం కూడా విద్యుత్ చార్జీలు పెంచడానికి సాహసం చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నూతన విద్యుత్ సంస్కరణల చట్టాన్ని తీసుకొచ్చి మళ్లీ ప్రజలపై భారాలు మోపడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని ఆలోచన చేయడం డిస్కం కంపెనీలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలని
కుట్రలు సాగిస్తోంది. దీనికి వ్యతిరేకంగా విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో మరో విద్యుత్ పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు ఏజే రమేష్ లిక్కి బాలరాజు జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ రెపాకుల శ్రీను, భూక్య రమేష్, మర్మం చంద్రయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, వై. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]
