మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ నిరసిస్తూ, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం చింతలపూడి లో టీడీపీ నాయకులు కార్యకర్తలు రిలే దీక్షలు చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద చింతలపూడి నియోజకవర్గం తెలగుదేశం పార్టీ మాజీ కన్వీనర్ జగ్గవరపు ముత్తారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈసందర్బంగా జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చంద్ర బాబు నీ ఏమి చేయలేరని ,దేశంలోనే సమర్థ పాలన అందించిన ఏకైక ముఖ్యమంత్రి చంద్ర బాబు అని ధీమా వ్యక్తం చేశారు.
[zombify_post]