శనివారం మట్టి మనుషులను పోరాట వీరులుగా మార్చిన ఉద్యమం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సిపిఎం మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు పేర్కొన్నారు, శనివారం ఆనందకాలనీ లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభ పామర్ బాలాజీ అద్యక్షతన జరిగినా సమావేశంలో రామారావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నైజాం ప్రాంతంలో వెట్టిచాకిరి, భూస్వామ్య విధానానికి, నైజాం ప్రభుత్వ దోపిడీకి వ్యతిరేకంగా అణగారిన పేదలను పోరుబాట పట్టించిందని. భూమికోసం, భూమి లో పండిన పంట పై హక్కు కోసం దొరలపై తిరగబడిన సాకలి అయిలమ్మ, దొడ్డి కొమురయ్య, లు స్పూర్తిదాయకమని వారి స్పూర్తితో తెలంగాణ లో దొరలను తరిమికొట్టి నాలుగు లక్షల ఎకరాల భూమి పంచారని, దున్నే వాడికే భూమి కావాలనే డిమాండ్ వచ్చిందని.ఆ పోరాటం వల్లనే నేడు తెలంగాణ లో పేదలకు సొంత భూములు ఉన్నాయని కొనియాడారు, బిజెపి, ఆరెస్సెస్ తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం రాజుకి వ్యతిరేకంగా జరిగిన పోరాటమని అబద్ధాలు ప్రచారం చేస్తూ విమోచన దినోత్సవాలు జరుపుతున్నారని వారికి తగిన బుద్ధి ప్రజలే చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు పామర్ బాలాజీ, సర్పంచ్ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]