రెండు వేర్వేరు కేసుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేయగా, 33ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్సీ చెంచుబాబు అధ్వర్యంలో రిజర్వు పోలీసు ఇనస్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డికి చెందిన రెండు టీమ్ లు గురువారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టాయి. ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్ తిరుమల చేరి, డౌన్ ఘాట్ రోడ్డులో తిరుపతి వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లను తనిఖీ చేసుకుని వస్తుండగా, శుక్రవారం ఉదయం తిరుపతి రూరల్ మండలం, టీఎన్ పాళ్యం సెక్షన్ వద్ద అలిపిరి ఫారెస్టు బీట్ పరిధిలో ఒక వాహనం నిలుపబడి ఉంది అందులో దుంగలు ఎక్కిస్తుండగా, వారిని చుట్టుముట్టారు. వారిలో అన్నమయ్య జిల్లా కెవీ మండలంకు చెందిన ఎస్.ఫయాజ్ (23)ను పట్టుకోగలిగారు. మిగిలిన వారు చీకట్లో తప్పించుకున్నారు. అక్కడ ఇండిగో మాంజా కారు, 33ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. మరో సంఘటనలో ఆర్ఎస్ఐలు వినోద్ కుమార్, కే.సురేష్ బాబు రంగంపేట చేరి, అక్కడ నుంచి మంగళంపేట వైపు తనిఖీలు చేసుకుని వెళుతుండగా, శుక్రవారం ఉదయం పనబాకం రేంజి, చంద్రగిరి సెక్షన్ భీమవరం ఫారెస్టు బీటు పరిధిలో కాలిబాట వద్దకు చేరుకోగా, అక్కడ మహీంద్ర స్కార్పియో నిలబడి ఉంది. కారులోని వ్యక్తులను విచారించగా, పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి కారులో తనిఖీ చేయగా అందులో రెండు పిడిలేని గొడ్డళ్లు కనిపించాయి. కారులోని వారిని తమిళనాడు తిరుపత్తూరు జిల్లా అంబూరు తాలూకాకు చెందిన రామరాజ్ నటరాజన్ (35), వానియంబాడి తాలూకాకు చెందిన మోహన్ వేల్ (24)లుగా గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో వారు ఎర్రచందనం దుంగల కోసం వచ్చినట్లు అంగీకరించారు. ఈ రెండు కేసులను టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమదు చేశారు. ఎస్ఐలు మోహన్ నాయక్, రఫీలు విచారిస్తున్నారు. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సిబ్బందిని కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ అభినందించారు.
[zombify_post]