in , ,

చంద్రబాబు అరెస్టుపై భగ్గుమన్న టీడీపీ శ్రేణులు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా సత్తుపల్లి మున్సిపాలిటీలో టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. సత్తుపల్లి రింగ్ సెంటర్లో ఆందోళన చేయగా కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళనను అడ్డుకోవడానికి స్థానిక పోలీసులు యత్నించారు. ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాలను నిప్పు అంటించి దగ్ధం చేశారు. అనంతరం టిడిపి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ నాయుడు కోటి మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సంబంధించిన కేసులో చంద్రబాబునాయుడు పేరులేకున్నా అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. జగన్‌ సైకోలాగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తప్పుడు కేసులతో రాజ్యాంగ విరుద్ధంగా అరెస్టు చేయడం దారుణమన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ పర్యటనలకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందని, వారిని నిలువరించేందుకు రాజకీయ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పోలీసులు ఖూనీ చేస్తున్నారని విమర్శించారు.

[zombify_post]

Report

What do you think?

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ

బిగ్ బ్రేకింగ్ : రేపు ఏపీ బంద్.. చంద్రబాబు రిమాండ్ కు నిరసనగా టీడీపీ కీలక నిర్ణయం