డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
01.09.2023 వ తేది మధ్యాహ్నం అమలాపురం మండలం, ఈదరపల్లి స్మశానం కాలవ గట్టు వద్ద అదే గ్రామానికి చెందిన పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ @ కిషోర్ అను వ్యక్తిని కొందరు వ్యక్తులు హత్య చేసి అతనితో పాటు ఉన్న అడపా సాయి అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరిచి పారిపోయిన దానిపై అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ కేసులో నిందితులైన ఐదుగురు ముద్దాయిలను 07.09.2023 తేదీన సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ కాబడిన ముద్దాయిల వివరాలు:
1. బళ్ళ సతీష్, వయసు /24సం.లు. గ్రామం /ఈదరపల్లి , అమలాపురం మండలం.
1.తాటికాయల శేష సుధీర్, వయసు/34సం.లు, గ్రామం /గుడాల, అల్లవరం మండలం,
3.కొప్పుల మణికంఠ @ సుబ్రహ్మణ్య మణికంఠ నాయుడు, వయసు/22సం.లు, గ్రామం/గుడాల, అల్లవరం మండలం,
4.కోడూరి లోవ శివకళ్యాణ్ @ కళ్యాణ్, వయసు/22సం.లు, గ్రామం/తొత్తరమూడి, ఐనవిల్లి మండలం,
5.అడబాల వీరబాబు, వయసు/40 సం.లు, గ్రామం/గుడాల, అల్లవరం మండలం,
ముద్దాయిల వద్ద నుండి స్వాదీనం చేసుకున్నవి:
1. i20 CAR Number AP05DT4577,
2. Royal Enfield Bullet Number.AP05EM0088,
3. Hero Honda Splendor Plus Motor Cycle Number.AP05EM1695,
4. ఇనుప రాడ్,
5. సర్వే కర్రలు -2,
6. IQOO మొబైల్ ఫోన్ -1,
అరెస్ట్ కాబడిన నిందితులను గౌరవ అమలాపురం A.J.F.C.M. కోర్టు కు రిమాండ్ రిపోర్టుతో పంపడం జరుగుతుంది. ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులను అరెస్ట్ చేయవలసి ఉన్నది.వారి కొరకు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగింది.
మృతుడు పోలిశెట్టి రామకృష్ణ కిషోర్ @ కిషోర్ అనే అతని పై అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్ లో రౌడీ షీటు ఉన్నది. అతను 31.08.2023 వ తేది రాత్రి తన స్నేహితులతో కలసి ముద్దాయి అయిన బళ్ళ సతీష్ మరియు అతని స్నేహితులపై చేయి చేసుకుని వారిపై దౌర్జన్యం చేసాడు. అదే విధంగా గ్రామంలో అతడి ఆధిక్యం ఎక్కువ అవుతుందనే కారణంతో ముద్దాయి బళ్ళ సతీష్ తన వారితో సంప్రదించి మిగిలిన వారి సహకారంతో ప్లాన్ చేసుకుని మధ్యహ్న సమయంలో మద్యం త్రాగి ఈదరపల్లి స్మశానం కాలవ గట్టు వద్ద ఉన్న మృతుడిని కొట్టి చంపడం జరిగినట్లుగా తేలింది. అలాగే ఈ హత్యకు ప్రేరేపించినవారు, సహకరించినవారు మరియు ముద్దాయిల పరారికి తోడ్పడిన వారినందరిని గుర్తించడం జరిగింది.
హత్య తదనంతరం అమలాపురం పట్టణంలో ఏర్పడిన పరిస్టితులకనుగుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వెంటనే ఏలూరు రేంజ్ డి.ఐ.జి శ్రీ. జి.వి.జి.అశోక్ కుమార్ దిశానిర్దేశాల ప్రకారం అదనపు బలగాలను తరలించి డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.పి శ్రీ.ఎస్.శ్రీధర్ పర్యవేక్షణలో శాంతి భద్రతలను అదుపులోనికి తీసుకుని రావడం జరిగింది.
అమలాపురం ప్రాంతంలో శాంతి బద్రతల నిర్వహణలో అందరు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎటువంటి చర్యలనైనా, వ్యక్తులనైన ఉపేక్షించేది ఉండదని, అటువంటి వారి పట్ల చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్.పి శ్రీ.ఎస్.శ్రీధర్ తో పాటు అడిషనల్ ఎస్.పి.శ్రీ ఖాధర్ బాషా, అమలాపురం డి.ఎస్.పి శ్రీ యం.అంబికా ప్రసాద్, అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ డి.దుర్గాశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]