డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ కార్యాలయం అమలాపురం

*జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో వున్నందున జిల్లాలో ఎక్కడా నిరసనలకు, ధర్నాలకు, బంద్ కు అనుమతి లేదని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్ పత్రిక ప్రకటన జారీ చేశారు.
*టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కి ఏ.సి.బి కోర్టు రిమాండ్ విధించిన మేరకు టిడిపి పార్టీ రాష్ట్ర బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బస్సుల రవాణాకు ఆటంకాలు, నిరసనలకు,ధర్నాలకు అనుమతి లేదన్నారు.
*పాఠశాలలు, కళాశాలలు, వ్యాపార సముదాయాలను బలవంతంగా మూయిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
*ప్రజల సాధారణ జన జీవనం రాకపోకలకు బలవంతంగా ఎలాంటి అసౌకర్యం కలిగించిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
*నిబంధనలు ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చి అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.
[zombify_post]