డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైస్ మిల్లులకు సంబంధించిన బకా యిలను ప్రాధాన్యత క్రమంలో చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూ ర్ అజయ్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులతో సమా వేశం నిర్వహించి రానున్న ఖరీఫ్ సీజన్లో ముందస్తు సన్నద్ధత, పెండింగ్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ ధాన్యం రవాణాకు ఉపయోగించే వాహనాలను ముందస్తుగా ఆర్బీకే లో రిజిస్ట్రేషన్ చేయించు కోవాలని, ప్రతి లారీ, ట్రక్కు నమోదు కావాలని ఆదేశించారు. పెండింగ్ బకాయిలు దశలవారీగా ప్రాధాన్యత క్రమంలో చెల్లించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు గోనె సంచులు యూజర్ చార్జీలు డ్రైయర్ల ఏర్పాటు మిల్లింగ్ చార్జీలు, ధాన్యం రవాణా చార్జీల పెండింగ్ అంశాలపై మిల్లర్ల తో సుదీర్ఘంగా చర్చించి చెల్లింపులకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రతి మండలంలో ఒక డ్రైయర్ ఏర్పాటు చేయాలని సూచించారు. గోనెసంచుల సరఫరా తదితర అంశాలపై పటిష్టమైన చర్యలు ముందస్తుగా చేపట్టి రైస్ మిల్లర్లకు ఎటువంటి అసౌకర్యం ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత పౌరసరఫరాలు జిల్లా సహకార అధికారులపై ఉందని ఆ దిశగా ప టిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షులు పట్టాభి రామయ్య చౌదరి. కార్యదర్శి ఇండిగల బుజ్జి, రైస్ మిల్లర్ల ప్రతినిధులు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎస్ సుధా సాగర్ జిల్లా పౌరసరఫరాల అధికారి ఏ పాపారావు, జిల్లా సహకార అధికారి రాధాకృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]