• మాఫీ అయినట్లు నోటీసు బోర్డులో పేర్లు
• ఖాతాలో డబ్బులు జమకాకపోవడంతో రైతుల ఆందోళన
వ్యవసాయ రుణమాఫీ విషయం లో గందరగోళం నెలకొంది. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమవు తున్నా కొంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమకావటం లేదు. రైతులు తీసుకున్న రుణాలకు సంబంధించి నగదు అకౌంట్ లో జమచేసిన వారి వివరాల లిస్టు కల్లూరులోని ఎస్బీఐ బ్యాంచ్కు వచ్చింది. ఈ లిస్టులో మాఫీ అయి, డబ్బులు జమ అయిన పేర్లలో అనేకమంది రుణం అకౌంట్లో డబ్బులు జమకాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఎవరిని సంప్రదిం చాలో తెలియక రైతుల ఆవేదనకు గురవుతున్నారు. ఈ విషయం తమ పరిధిలోనిది కాదని బ్యాంకు సిబ్బంది చెబుతుండగా, వ్యవసాయ అధికారులు కూడా తాము ప్రభుత్వానికి లిస్టు ఇచ్చామని, డబ్బులు జమకాని విషయంలో తమకు సంబంధం లేదంటున్నారు. ఇప్పటికైనా బ్యాంకు ఉన్నతాధి కారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.

[zombify_post]