రాజమహేంద్రవరం లోని ఆంధ్ర పేపర్ లిమిటెడ్ వ్యర్థ పదార్థాలు, వ్యర్థ జలాలు విడుదల చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న కారణంగా తక్షణమే ప్రజలు లేని ప్రదేశానికి తరలించాలని గౌరవ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఇమెయిల్ ద్వారా కోరినట్లు జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యులు గొట్టిముక్కల అనంతరావు తెలిపారు. పేపర్ మిల్ కాలుష్యం వలన అనేక మంది చిన్న పిల్లలు, పెద్దలు అనేక ఇబ్బందులు పడి మృతి చెందారన్నారు. లూధరగిరి, ఆనంద్ నగర్, కోటిలింగాలపేట, మల్లయ్యపేట, కాతేరు కు చెందిన ప్రజలు అనేక సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పేపర్ మిల్లు నుండి కలుషిత నీరు నేరుగా గోదావరి నదిలోకి వెళ్లడం వలన మనం త్రాగే నీరు కలుషితం అవుతుందన్నారు. కాలుష్య నివారణకు మిల్లు వారు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు వారికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా వారు అవినీతి కోరల్లో నిండి స్పందించటం లేదన్నారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా తక్షణం స్పందించి చర్యలు చేపట్టాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు తనిఖీ చేపట్టే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
[zombify_post]