ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇన్‌చార్జిలు రాజమహేంద్రవరంలో నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని…రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని ఈ సందర్భంగా చర్చించారు. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ…రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని….చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదని అన్నారు.రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ స్థాయి విద్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని….గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని బ్రాహ్మణి అన్నారు. తెలుగు దేశం, జనసేన.. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటు పై లోకేశ్ చర్చిస్తున్నారని తనను కలిసిన జనసేన నేతలకు ఆమె తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్న బ్రాహ్మణి…..స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. నారా బ్రహ్మణిని కలిసిన జనసేన నేతల్లో ముత్తా శశిధర్, తోట సుధీర్,తుమ్మల రామ స్వామి బాబు,పితాని బాలకృష్ణ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, పోలిశెట్టి చంద్ర శేఖర్, గంటా స్వరూపా రాణీ, బత్తుల బల రామకృష్ణ, వాసిరెడ్డి శివ, మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య బాబు తదితరులు ఉన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!