రాజమహేంద్రవరం బొమ్మూరు ప్రాంతంలో ఉన్న పాఠశాల ప్రభుత్వ గుర్తింపు లేకుండా దాదాపు 700 మంది విద్యార్థులను అక్రమంగా జాయిన్ చేసుకొని ఒక్కొక్కరి నుండి వేలాది రూపాయలు ఫీజుల పేరుతో దోపిడీ చేసిన నేపథ్యంలో పాఠశాలకు పర్మిషన్ లేదని జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలను సీజ్ చేశారు. ఈ సందర్భంలో తమ బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని తమ పిల్లల జీవితాలతో శ్రీ చైతన్య యాజమాన్యం చెలగాటం ఆడుతుందని వారం రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు… దీనిపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యవర్గం బొమ్మూరు లో ఉన్న పాఠశాలను సందర్శించిన నేపథ్యంలో అక్కడ చాలా దారుణమైన పరిస్థితులు తారసపడ్డాయి జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాలను సీజ్ చేసిన గాని ప్రభుత్వ నిబంధనలు పట్టించుకోకుండా అక్రమంగా హాస్టల్ నడుపుతూ సెలవు దినం ఆయన కూడా వరండాలో విద్యార్థులను కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్న సంఘటన వెలుగు చూసింది… దీనిపై విద్యార్థి సంఘం నాయకులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు… పాఠశాలలో తరగతులు ఎలా నిర్వహిస్తారని యాజమాన్యాన్ని ప్రశ్నించారు… పాఠశాల వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఈ భూషణం కే భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యాసంస్థ అక్రమాలు ఆగడాలు మరింత ఎక్కువయ్యాయని విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వి మహర్షి సహాయ కార్యదర్శి కాకి నాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుపతిరావు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జే సత్తిబాబు ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు
This post was created with our nice and easy submission form. Create your post!